హైదరాబాద్: 28°C
క్రైమ్

డేటింగ్ యాప్‌ పేరుతో దోపిడీ

AP: విజయవాడలో డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన వ్యక్తి ఓ యువకుడిపై దాడికి పాల్పడి డబ్బులు దోచుకున్నాడు. యూపీఎస్సీకి సిద్ధమవుతున్న యువకుడికి యాప్‌ ద్వారా నిందితుడు పరిచయమయ్యాడు. అనంతరం అతడి ఇంటికి వచ్చిన నిందితుడు గదిలోకి వెళ్లాక కత్తి చూపించి బెదిరించాడు. యువకుడిపై దాడి చేసి డబ్బులు లాక్కొని అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదుతో పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.