హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిర్లక్ష్యం లేక నిరుపయోగంగా మారిన పల్లె ప్రకృతివనం

ASF: చింతలమానెపల్లి మండలం గూడెం గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతివనంపై నిర్వహణ కొరవడింది. ప్రస్తుతం మందుబాబులకు అడ్డాగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతివనం ప్రధాన ప్రవేశ ద్వారం గేటు ఊడిపోయి కింద పడిపోయినా సంబంధిత అధికారులు స్పందించడం లేదు. మొక్కలను సంరక్షించకపోవడంతో అవి ఎండిపోతున్నాయి.