హైదరాబాద్: 28°C
తెలంగాణ

అద్దె బకాయిలతో ESI ఆసుపత్రికి తాళం

NLG: మిర్యాలగూడ పట్టణంలోని ESI వైద్యశాల అద్దె బకాయిల కారణంగా మూతపడింది.భవన యజమాని తాళం వేయడంతో గత నాలుగు రోజులుగా ఆసుపత్రి సేవలు నిలిచిపోయాయి. దీంతో వైద్య సిబ్బంది ఆసుపత్రి బయట మెట్లపైనే రోగులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మందుల పంపిణీ, అత్యవసర వైద్య సేవలు అందక కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.