KMR: బాన్సువాడ పట్టణ కేంద్రంతో పాటు పరిసర గ్రామాలలో చలి తీవ్రత పెరిగింది. శనివారం ఉదయం బాన్సువాడను దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం వేళల్లో పొగమంచు కారణంగా రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు సరిగా కనిపించక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు,వృద్ధులు,చిన్నపిల్లలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
తెలంగాణ
బాన్సువాడలో పెరిగిన చలి తీవ్రత


