హైదరాబాద్: 28°C
క్రైమ్

డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం!

AP: ప్రకాశం జిల్లా పెళ్లూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతులను డ్రైవర్ ప్రవీణ్, వెంకట్రావు, సుజాత, సీతామహాలక్ష్మిగా పోలీసులు గుర్తించారు. నూతన వధూవరులు శ్రీతేజ, కౌశల్య స్వల్ప గాయాలతో బయపపడ్డారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. పెళ్లి బృందంతో వెళ్తున్న కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.