హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

లెమన్ టీ ఎక్కువగా తాగుతున్నారా..?

లెమన్ టీ ఆరోగ్యానికి మంచిదే అయినా, అతిగా తాగితే అనర్థాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులో ఉండే సిట్రిక్ యాసిడ్ దంతాల ఎనామిల్‌ను దెబ్బతీసి సున్నితత్వాన్ని పెంచుతుంది. అలాగే కడుపులో మంట, అసిడిటీ, డీహైడ్రేషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. కెఫిన్ వల్ల నిద్రలేమి కూడా రావచ్చు. కాబట్టి రోజుకు ఒకటి లేదా రెండు కప్పులకు మాత్రమే పరిమితం చేయడం ఆరోగ్యానికి ఉత్తమం.