హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఆలస్యంగా నిద్రపోతున్నారా?

రాత్రులు ఆలస్యంగా నిద్రపోవడం వల్ల బయోలాజికల్ క్లాక్ పూర్తిగా దెబ్బతింటుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి తగ్గి అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గుండె జబ్బులు, మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మానసిక ఒత్తిడి పెరిగి ఏకాగ్రత కూడా లోపిస్తుంది. కాబట్టి ప్రతిరోజూ రాత్రి పది గంటల లోపే నిద్రపోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.