హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

కాంటాక్ట్‌ లెన్సులు వాడుతున్నారా?

కాంటాక్ట్‌ లెన్సులు వాడేటప్పుడు కళ్ల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరమని నిపుణులు చెబుతున్నారు. లెన్స్‌లను తాకే ముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. రాత్రి నిద్రపోయే ముందు వీటిని తప్పనిసరిగా తీసేయాలి. లెన్స్‌లను శుభ్రం చేయడానికి కేవలం స్టెరైల్ సొల్యూషన్ మాత్రమే వాడాలి. గడువు తీరిన లెన్స్‌లను వాడకూడదు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.