రోజువారీ డైట్‌లో వెల్లుల్లి చేర్చడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని అల్లిసిన్ అనే సమ్మేళనం రోగనిరోధక శక్తిని పెంచి, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే కొలెస్ట్రాల్ తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు యాంటీబాక్టీరియల్ గుణాలతో ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ఆరోగ్యం
మీ రోజువారీ డైట్‌లో వెల్లుల్లి ఉందా..?


