హైదరాబాద్: 28°C
క్రీడలు

స్మిత్ ప్రాక్టీస్‌కు మీడియా నో ఎంట్రీ

ఆస్ట్రేలియా క్రికెట్‌లో 2018 బాల్ ట్యాంపరింగ్ వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. ఆ దేశ క్రికెటర్ స్టీవ్ స్మిత్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా మీడియా ప్రతినిధులు, కెమెరాలకు అనుమతి నిరాకరించారు. ఉస్మాన్ ఖవాజా, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. వివాదంపై స్మిత్ ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదు.