అబుదాబి టీ10 లీగ్‌లో వెస్టిండీస్ ఆటగాడు హెట్మయర్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. కేవలం 39 బంతుల్లోనే అజేయంగా 102 రన్స్ చేశాడు. దీంతో ఎమిరేట్స్ ఈగిల్స్ 10 ఓవర్లలో 147 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో యునైటెడ్ టైగర్స్ 107 పరుగులకే పరిమితమైంది. ఈగిల్స్ 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. హెట్మయర్ సీజన్లో 428 పరుగులతో సరికొత్త రికార్డు సృష్టించాడు.
క్రీడలు
39 బంతుల్లోనే సెంచరీ!


