E.G: మండల పరిషత్ సమావేశాలకు మహిళా MPTC సభ్యులు స్వయంగా హాజరు కావాలని, భర్తలను పంపొద్దని MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సూచించారు. రంగంపేట మండల పరిషత్ MPTCలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మహిళా సాధికారత కోసం అత్యధిక సీట్లు కేటాయించారన్నారు. ఇప్పటి నుంచే సమావేశాలకు అలవాటు పడితే భవిష్యత్తులో MLAలుగా పోటీకి సిద్ధంగా ఉంటారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'సమావేశాలకు భర్తలను పంపొద్దు.. మీరే రండి'


