టీమిండియాకు తొలిసారి ఎంపికైన క్షణాలను రోహిత్ శర్మ గుర్తుచేసుకున్నాడు. బీసీసీఐ నుంచి ఎంపికైనట్లు ఫోన్ వచ్చినప్పుడు ఉక్కిరిబిక్కిరి అయ్యానని తెలిపాడు. బెంగళూరులో ఉన్నప్పుడు ఆ కాల్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూశానన్నాడు. సాయంత్రం ఐదు గంటలకు ఫోన్ రాగానే ఎగిరి గంతేశానని, ఆ ఆనందంలో స్వల్పంగా గాయపడ్డానని ఓ కార్యక్రమంలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
క్రీడలు
ఆ ఫోన్ కాల్ ఎప్పటికీ మరిచిపోలేను: హిట్‌మ్యాన్


