హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరు జడ్పీ ఛైర్మన్‌గా పోలంరెడ్డి..!

నెల్లూరు జడ్పీ ఛైర్మన్‌గా కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. ఆయన ఇందుకూరుపేట జడ్పీటీసీగా ఏకగ్రీవం అయిన విషయం అందరికి తెలిసిందే. ఇవాళ నెల్లూరు జడ్పీటీసీలు అందరూ ప్రమాణస్వీకారం చేస్తారు. తరవాత ఆయనను ఛైర్మన్‌గా ఎన్నుకుంటారు. పలువురు పోలంరెడ్డికి అభినందనలు తెలియజేశారు.