హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేంపల్లి రహదారిపై పొంచి ఉన్న ప్రమాదం

అన్నమయ్య: మదనపల్లి మండలం వేంపల్లి గ్రామానికి వెళ్లే రహదారి ప్రయాణికులకు ప్రమాదకరంగా మారింది. ఈ మార్గంలోని బహుదా నది కాలువపై నిర్మించిన వంతెన సరిగ్గా మలుపు వద్ద ఉండటంతో పాటు... కాలువలో దట్టంగా కంప చెట్లు, పిచ్చి మొక్కల పెరగడంతో వంతెన కనిపించడం లేదు. దీంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.