ELR: నిడమర్రు మండలం ఆముదాలపల్లి ఎస్సీ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీలోని శ్మశానవాటికకు వెళ్లే మార్గం ముంపుకు గురికావడంతో దారి పొడవునా నీరు నిలిచిపోయింది. ఎవరైనా మరణిస్తే అంత్యక్రియల కోసం మృతదేహాలను మోసుకుని వెళ్లడం నరకప్రాయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో సమస్య తీవ్రతరం అవుతోందన్నారు. సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
అంత్యక్రియల వేళ అవస్థలు.. రహదారిని బాగుచేయాలని వేడుకోలు


