హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు రుక్మిణి కళ్యాణం

CTR: పుంగనూరు కృష్ణంరెడ్డిపల్లి సమీపంలోని శ్రీకృష్ణుని మందిరంలో కార్తీక శుక్ల ద్వాదశి సందర్భంగా రుక్మిణీ కళ్యాణం రేపు నిర్వహిస్తున్నట్లు అర్చకులు శుక్రవారం తెలిపారు. ఉదయం మూలవర్లకు అభిషేకాలు చేస్తారు. అనంతరం ఉత్సవమూర్తులను ఊరేగిస్తారు. తర్వాత రుక్మిణి కళ్యాణం జరుగుతుందని చెప్పారు. తులసి దళాలతో సహస్రనామార్చన, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం సైతం ఉంటుంది.