హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

చర్మం ముడతలు పడుతుందా..?

చిన్న వయసులోనే ముఖంపై ముడతలు రావడానికి కాలుష్యం, ఒత్తిడితో పాటు మన దైనందిన పొరపాట్లే కారణమని నిపుణులు చెబుతున్నారు. చక్కెర ఎక్కువగా తినడం, ఆరోగ్యకరమైన కొవ్వులను (ఒమేగా-3) పూర్తిగా మానేయడం వల్ల చర్మం మృదుత్వం కోల్పోతుంది. అలాగే ఒకే పక్కకు తిరిగి నిద్రపోవడం, చర్మానికి సరిపడని సబ్బులు వాడటం, బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ రాసుకోకపోవడం వల్ల త్వరగా ముడతలు పడతాయి.