హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సీఎం సభ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణం వై జంక్షన్ సమీపంలో సీఎం పర్యటన సభ స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బహిరంగ సభలో ప్రజలకు ఇబ్బంది లేకుండా త్వరగా ఏర్పాట్లు పూర్తి చేయాలని కోరారు. ఈనెల 26 సీఎం రాక నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నారు.