ప్రధాని మోదీ ఇవాళ మూడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్‌లో పలు కీలక కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. తొలుత బెంగాల్‌లోని ఐఐటీ ఖరగ్‌పూర్ వజ్రోత్సవ వేడుకలకు హాజరవుతారు. అనంతరం బీహార్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు. ఆ తర్వాత లక్నోలో జరిగే 'కౌశల్ దీక్శాంత్ సమారోహ్' కార్యక్రమంలో ప్రధాని పాల్గొననున్నారు.
వార్తలు
మూడు రాష్ట్రాల్లో మోదీ సుడిగాలి పర్యటన


