హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ నుంచి వైసీపీలోకి చేరికలు

GNTR: తెనాలి మండలం నెలపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు వైసీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ తగిన ప్రాధాన్యత, గౌరవం కల్పిస్తామని తెలిపారు. పార్టీ అభివృద్ధి, బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.