హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రంక్ అండ్ డ్రైవ్.. 30 రోజుల జైలుశిక్ష

MDK: మద్యం సేవించి వాహనం నడిపిన అన్నమాచారి అనే వ్యక్తికి 30 రోజుల జైలుశిక్ష విధిస్తూ.. నర్సాపూర్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ బాల్ రెడ్డి తీర్పునిచ్చారు. ఈ నెల 18న SI రంజిత్ రెడ్డి తనిఖీల్లో బైక్ నడుపుతూ పట్టుబడిన నిందితుడిని కోర్టులో హాజరుపరచగా ఈ శిక్ష పడింది. అనంతరం అతడిని కంది జైలుకు తరలించినట్లు SI వెల్లడించారు.