హాంకాంగ్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ సత్తాచాటుతున్నాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో సింగపూర్ ఆటగాడు కీన్ యూపై 21-17, 10-21, 21-13తో గెలిచి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఇవాళ జరిగే సెమీస్‌లో డెన్మార్క్ ఆటగాడు ఆండర్స్ ఆంథోన్సెన్తో తలపడనున్నాడు. మరోవైపు కిదాంబి శ్రీకాంత్ 17-21, 7-21తో కున్లావుత్ వితిద్సర్న్ చేతిలో ఓడిపోయాడు.
క్రీడలు
సెమీస్‌కు దూసుకెళ్లిన లక్ష్యసేన్


