హైదరాబాద్: 28°C
క్రీడలు

పాక్ పేసర్ అరుదైన ఘనత

పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ అబ్బాస్ అరుదైన ఘనత సాధించాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో 8 వికెట్లు తీసి 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు గెలుచుకున్నాడు. దీంతో 2026 ఏడాదిలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అబ్బాస్ (39 వికెట్లు) అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాతి స్థానాల్లో జోష్ టంగ్ (33), మిచెల్ స్టార్క్ (32) ఉన్నారు. మెహిది మిరాజ్, ఓలీ రాబిన్సన్ 28 వికెట్లతో కొనసాగుతున్నారు.