హైదరాబాద్: 28°C
క్రీడలు

రైల్వేస్‌పై హర్యానా సిక్సర్ల వర్షం

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రైల్వేస్‌తో మ్యాచ్‌లో హర్యానా బ్యాటర్లు సిక్సర్ల వర్షం కురిపించారు. ఇన్నింగ్స్‌లో ఏకంగా 17 సిక్సర్లు బాదారు. దీంతో ఆ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 246 పరుగుల భారీ స్కోరు చేసింది. యశ్‌వర్ధన్ దలాల్ (75), కెప్టెన్ అంకిత్ రాజేశ్ (54) అర్ధసెంచరీలతో మెరిశారు. ఈ టోర్నీ చరిత్రలో హర్యానాకు ఇది రెండో అత్యధిక స్కోరు.