హైదరాబాద్: 28°C
వార్తలు

ఇంటర్ విలీనాన్ని స్వాగతిస్తున్నాం: ట్రస్మా

TG: ఇంటర్‌ను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రభుత్వ ప్రతిపాదనను ట్రస్మా స్వాగతించింది. ఈ సంస్కరణ విద్యార్థుల నైపుణ్యాల పెంపుదల, సమగ్ర వికాసానికి దోహదపడాలని ట్రస్మా నేతలు పేర్కొన్నారు. విధాన రూపకల్పన కమిటీలు, సంప్రదింపుల్లో తమకు భాగస్వామ్యం కల్పించాలని కోరారు. అందరిపై ప్రభావం చూపే ఈ విధానాన్ని విస్తృత చర్చల తర్వాతే ఖరారు చేయాలని సూచించారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షులు మధుసూదన్ ప్రకటన విడుదల చేశారు.