ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో నేపాల్-Aపై భారత్-A 306 పరుగుల భారీ విజయం సాధించింది. ఇది భారత లిస్ట్-A చరిత్రలోనే అతిపెద్ద విజయం. దీనిపై కెప్టెన్ తిలక్ వర్మ స్పందిస్తూ తమ బౌలర్లు అద్భుతం చేశారని కొనియాడాడు. ముఖ్యంగా గాయం నుంచి కోలుకొని వచ్చిన హర్షిత్ రానా, ప్రిన్స్ యాదవ్ అదరగొట్టారని చెప్పాడు. పాకిస్తాన్-Aతో పోరుకు ముందు ఈ విజయం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపాడు.
క్రీడలు
మా బౌలర్లు అద్భుతం చేశారు: తిలక్


