హైదరాబాద్: 28°C
తెలంగాణ

శాతవాహన వర్సిటీ NSS వాలంటీర్ల ప్రతిభ

KNR: హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి అడ్వెంచర్ క్యాంపులో శాతవాహన విశ్వవిద్యాలయ NSS వాలంటీర్లు ప్రతిభ చాటారు. క్యాంపు మూడో రోజు సహజ పర్వతారోహణలో భాగంగా 1,500 అడుగుల ఎత్తైన కొండను ఉత్సాహంగా అధిరోహించారు. కంటింజెంట్ లీడర్ డా. అర్జున్, కోఆర్డినేటర్ జితేందర్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు.