హైదరాబాద్: 28°C
తెలంగాణ

త్రివేణి సంగమానికి హారతులు

BHPL: కార్తీక మాసోత్సవాల్లో భాగంగా కాళేశ్వరంలోని సరస్వతి ఘాట్ వద్ద గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల సంగమానికి ఆలయ అర్చకులు తొమ్మిది రకాల హారతులు నిర్వహించారు. ఐదు రోజుల పంచరత్నాల కార్యక్రమంలో భాగంగా వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలు చేపట్టారు. దీపాల కాంతులతో నదీ తీరం భక్తి పారవశ్యంతో నిండిపోగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.