గుంటూరు వైద్య కళాశాలలో మెటబాలిక్ హెల్త్‌పై జరిగిన ప్రత్యేక ఉపన్యాసంలో ముఖ్య వక్త డాక్టర్ కృష్ణమూర్తి నరసింహన్ పాల్గొన్నారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లోపం వల్ల మధుమేహం, బీపీ, ఊబకాయం, గుండె జబ్బులు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు. సమతుల ఆహారం, వ్యాయామం, క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలతో వీటి ముప్పును నివారించవచ్చని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'మంచి జీవనశైలితోనే అసంక్రమిత వ్యాధుల నివారణ'


