ELR: బుట్టాయగూడెం మండలం కామవరం, గుబ్బల మంగమ్మ గుడి ప్రాంతాల్లోని అడవులను అటవీశాఖ శిక్షణ ఏసీఎఫ్ విజయభారతి శుక్రవారం పరిశీలించారు. ఆంధ్రా-తెలంగాణ సరిహద్దు సర్వే వివరాలు, చెక్ డ్యాంలను తనిఖీ చేశారు. సర్వే వేగవంతం చేసి రహదారి అభివృద్ధికి సహకరించాలని గుడి కమిటీ కోరింది. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
గుడుల ప్రాంతాల్లో అటవీశాఖ అధికారుల తనిఖీలు


