హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజానగరంలో 21 నుంచి నామినేషన్ల పర్వం

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం, కోరుకొండ, సీతానగరం మండలాల్లో 3వ విడత పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 21 నుండి 23 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 24న పరిశీలన, 25, 26 తేదీల్లో అభ్యంతరాల దాఖలుకు అవకాశం ఉంటుంది. నవంబర్ 27న ఉపసంహరణ గడువు ముగియనుండగా, డిసెంబర్ 2న ఉదయం నుండి పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు.