హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పల్నాడు పథకంపై తెలంగాణ ఫిర్యాదు

నాగార్జునసాగర్ బ్యాక్‌వాటర్ నుంచి పల్నాడు తాగునీటి ప్రాజెక్టు పనులను అనుమతులు లేకుండా ప్రారంభించారని తెలంగాణ ఆరోపించింది. సుమారు రూ.1,200 కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా 1.35 టీఎంసీల నీటిని తరలించడం జలదోపిడీగా తెలంగాణ పేర్కొంది. ఈ మేరకు కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసినట్లు నల్గొండ సీఈ శ్రీనివాసరెడ్డి తెలిపారు. పనులు నిలిపివేయాలని డిమాండ్ చేస్తామన్నారు.