హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం'

BPT: గ్రామాలు, పట్టణాల అభివృద్ధిలో స్థానిక సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని బాపట్ల ఎంపీ, లోక్‌సభ ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ అన్నారు. శుక్రవారం బాపట్ల పట్టణంలోని 22వ వార్డులో కూటమి బలపరిచిన జనసేన అభ్యర్థి విన్నకోట దీపిక ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.