హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఎస్ఎఫ్ఐ మహాసభలను విజయవంతం చేయాలి'

KNR: జమ్మికుంటలో డిసెంబర్ 2, 3 తేదీల్లో జరగనున్న ఎస్‌ఎఫ్‌ఐ కరీంనగర్ జిల్లా 19వ మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ కోరారు. శుక్రవారం మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు. విద్యారంగ సమస్యలపై చర్చించి, భవిష్యత్తు పోరాటాలకు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.