హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆదిలాబాద్ వినాయక చౌక్‌ను కుదించాలి'

ADB: ఆదిలాబాద్ చౌరస్తాల పునరుద్ధరణలో భాగంగా గతంలో చౌరస్తాలను విస్తరించడంతో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు వాపోయారు. అధికారులు స్పందించి తెలంగాణ తల్లి, కొమురం భీం చౌరస్తాల కుదింపు చేపట్టారు. తాజాగా తెలంగాణ తల్లి చౌక్లో కుదింపు పనులు జరుగుతున్న నేపథ్యంలో వినాయక చౌక్ను సైతం కుదించాలని స్థానికుల నుంచి డిమాండ్ పెరుగుతోంది. వినాయక చౌక్లో ఇప్పటికే పలు ప్రమాదాలు జరిగాయి.