హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

25 మంది ఎన్‌సీసీ క్యాడెట్ల ఎంపిక

ASR: అరకులోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డా కుసుమకుమారి ఆధ్వర్యంలో ఎన్‌సీసీ క్యాడెట్ల ఎంపిక నిర్వహించారు. 13వ ఆంధ్ర బెటాలియన్ అధికారులు నిర్వహించిన ఈ ఎంపికల్లో 50 మంది విద్యార్థినులు పాల్గొనగా, శారీరక సామర్థ్య పరీక్షల అనంతరం 25 మందిని ఎంపిక చేశారు. ఎన్‌సీసీతో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, దేశభక్తి పెంపొందుతాయని ప్రిన్సిపాల్ తెలిపారు.