GNTR: YCP MLC లేళ్ల అప్పిరెడ్డిని మూడు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ జిల్లా కోర్టు అనుమతించింది. MPTC ఎన్నికల సందర్భంగా బ్యాలెట్ బాక్స్‌ను లాక్కొని అధికారుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో అరెస్ట్ చేశారు. రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. విచారణ కోసం పోలీసులు 8 రోజుల కస్టడీ కోరగా, కోర్టు 3 రోజులకు కుదించింది. బెయిల్ పిటిషన్ విచారణ ఈ నెల 25కు వాయిదా పడింది.
ఆంధ్రప్రదేశ్
లేళ్ల అప్పిరెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ


