AKP: అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా మునగపాక మండలం తోటాడ జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా బాలల సంరక్షణ విభాగం సామాజిక కార్యకర్త కేఎల్‌వీ రమ్య బాలల హక్కులు, విద్యా హక్కు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాల నివారణ, వేధింపుల నిరోధంపై వివరించారు. సమస్యలు ఎదురైతే 1098కు ఫోన్ చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులకు అవగాహన కార్యక్రమం


