హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాలకొల్లులో రెండు కార్లు ఢీ

W.G: పాలకొల్లు మండలం దిగ్గమర్రు బైపాస్ వద్ద రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో రాఘవ, రాజేష్, చరణ్, సాహెబ్ అనే నలుగురు యువకులు గాయపడ్డారు. పేరూరులో పుట్టినరోజు వేడుకకు లైటింగ్ వేయడానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మరో కారులో ఉన్న యువతి ఎయిర్‌బ్యాగ్‌ల కారణంగా స్వల్ప గాయాలతో బయటపడింది. క్షతగాత్రులను పోలీసులు పాలకొల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.