కరీంనగర్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శుక్రవారం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన TNGO జిల్లా అధ్యక్షుడు శ్రీనివాల్రెడ్డి మాట్లాడుతూ.. గ్రంథాలయాలు విజ్ఞానానికి ఆలయాలని, ఉన్నత స్థితికి ఎదగాలంటే పుస్తక పఠనం ఎంతో అవసరమని అన్నారు. విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
తెలంగాణ
ముగిసిన జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు


