PPM: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కొమరాడ మండలం రవికోన గ్రామంలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన 1,200 లీటర్ల పులియబెట్టిన బెల్లం ఊటను ధ్వంసం చేసి, ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. జిల్లా ఎక్సైజ్ అధికారి కే.సహదేవ, ఎస్టీఎఫ్ డీఎస్పీ రామారావు పర్యవేక్షణలో ఈ దాడులు జరిగాయి.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల వేళ ఎక్సైజ్ దాడులు


