MDK: తూప్రాన్ పట్టణంలో నూతనంగా ప్రారంభించనున్న కోర్టు ప్రారంభ ఏర్పాట్లను జిల్లా న్యాయమూర్తి నీలిమ పరిశీలించారు. ఈనెల 24న ప్రారంభించేందుకు తేదీలను ఖరారు చేశారు. దాంతో జిల్లా న్యాయమూర్తి భవన మరమ్మత్తు పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. పనులను త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. డీఎస్పీ నరేందర్ గౌడ్, కమిషనర్ రమేష్ కుమార్ పాల్గొన్నారు.
తెలంగాణ
కోర్టు ప్రారంభ ఏర్పాట్లను పరిశీలించిన జడ్జ్


