ASR: జీ.మాడుగుల మండలంలోని కోరాపల్లికి చెందిన టీడీపీ నాయకుడు, ఆర్ఎంపీ వైద్యుడు వాళంగి రమణమూర్తి మృతి పార్టీకి తీరని లోటని ఎంపీపీ గబ్బాడి శాంతికుమారి అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన శుక్రవారం ఆయన కుటుంబాన్ని పరామర్శించి, మృతదేహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రమేష్‌బాబు, ఎంపీటీసీ చిన్నకొండబాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'టీడీపీ నాయకుడి మృతి తీరని లోటు'


