హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముగిసిన జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

జనగామ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మారుజోడు రాంబాబు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.