హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 23న కనిగిరి మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక

ప్రకాశం: కనిగిరి మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక ఈ నెల 23న నిర్వహించనున్నట్లు కమిషనర్ శ్రీధర్ తెలిపారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్‌పర్సన్, వార్డు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం అనంతరం ఎన్నిక జరగనుంది. ఎన్నికల అధికారిగా ఆర్డీవో అజయ్ కుమార్‌ను నియమించారు. ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డితో పాటు చైర్‌పర్సన్, కౌన్సిలర్లకు ఫారం-2 నోటీసులు అందజేశారు.