WGL: నిరుద్యోగం, నిత్యావసర ధరల పెరుగుదలకు నిరసనగా డిసెంబర్ 2న జైల్ భరో నిర్వహించనున్నట్లు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం వరంగల్ శివనగర్ తమ్మెర భవన్లో జరిగిన జిల్లా కార్యదర్శుల సమావేశంలో మాట్లాడారు. నవంబర్ 26న మండల కేంద్రాల్లోని అంబేద్కర్ విగ్రహాల వద్ద రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం జరపాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
డిసెంబర్ 2న సీపీఐ జైల్ భరో


