CTR: శాంతిపురం మండలం సాన్నేగానిపల్లి ఆర్.ఎస్.కేలో మామిడి సాగులో మెళకువలు, సస్యరక్షణపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మామిడి తోటల్లో తేనె మంచు పురుగు ఉద్ధృతి అధికంగా ఉన్నందున నివారణకు తగిన మందులు పిచికారీ చేయాలని సూచించారు. పూత ఒకేసారి, త్వరగా రావడానికి డిసెంబర్ రెండో వారంలో పొటాషియం నైట్రేట్, అర్కా మాంగో మిశ్రమాన్ని పిచికారీ చేయాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మామిడి సాగులో మెళకువలపై అవగాహన


