కృష్ణా: నాగాయలంక మండలం పెదపాలెం మాజీ సర్పంచ్ దున్నా రాజేష్ జనసేన పార్టీలో చేరారు. శుక్రవారం సాయంత్రం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. మాజీ సర్పంచ్ రాజేష్, మాజీ ఉప సర్పంచ్ మేడికొండ వెంకటేష్ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన 50మంది జనసేన పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, మండలి వెంకట్రామ్ వారికి జనసేన కండువాలతో స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్
జనసేనలో చేరిన మాజీ సర్పంచ్


