హైదరాబాద్: 28°C
తెలంగాణ

110 రోజుల్లో అమ్మవారికి భారీ ఆదాయం

BDK: పాల్వంచ పెద్దమ్మగుడి హుండీలను శుక్రవారం లెక్కించగా 110 రోజులకు రూ.29,28,083 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో విజయ్ కుమార్ తెలిపారు. నగదుతో పాటు 38.595 గ్రాముల మిశ్రమ బంగారం, 907.546 గ్రాముల వెండి లభించినట్లు వెల్లడించారు. అమెరికా డాలర్లు, యూఏఈ దిర్హామ్ నోట్లను కూడా భక్తులు హుండీల్లో సమర్పించినట్లు పేర్కొన్నారు.